మిక్సీజార్ ప్రతిఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా వుండే ఒక విలువైన యంత్రం. ఈ పరికరంతో పండ్లరసాలనుగానీ, మసాలాలుగానీ, ఇతర పిండిపదార్థాలను రుబ్బుకోవడానికి తరుచుగా వాడుతుంటారు. అయితే దీని వాడకంలో కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఇవి అతి తక్కువ సమయంలో చెడిపోవడం జరుగుతోంది. లోపలున్న మోటార్ చెడిపోవడం, ఇంకా ఇతరత్ర సమస్యలు వస్తూ వుంటాయి. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వుండాలంటే కొన్ని చిట్కాలు అందుబాటులో వున్నాయి.
అవేమిటంటే.. ఏదైనా పిండి రుబ్బుతున్న సమయంలో మిక్సీజార్’పై వున్న మూతను ఎక్కువగా అదిమి పట్టుకోకూడదు. ఎందుకంటే.. మూతమీద ఎక్కువ బరువు వేయడం వల్ల కూడా మోటార్’పై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా అది చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి.. గట్టి అదిమి పట్టుకోవద్దు. అలాగే.. మిక్సీజార్’లో సగం కంటే ఎక్కువ పదార్థాలు వేయకూడదు. అలాచేస్తే.. మిక్సర్, జార్’ల పనితీరు త్వరగా మందగిస్తుంది.