Dum Paneer Kali Mirch Recipe cooking tips By , 2015-01-02 Dum Paneer Kali Mirch Recipe cooking tips Dum Paneer Kali Mirch Recipe cooking tips : the cooking tips to make dum paneer kali mirch recipe. It is a punjabi traditional recipe. Prep Time: 25min Cook time: 30min Ingredients: 500 గ్రాములు పన్నీర్, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 1 కప్ పెరుగు, 1-2 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్స్ నెయ్యి, 2-3 బిర్యానీ ఆకులు, 1-2 దాల్చిన చెక్క, 3-4 యాలకులు, 4-5 లవంగాలు, 2 టీ స్పూన్స్ ధనియాలపొడి, 1 టీ స్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 1/2 టీ స్పూన్ గరంమసాలా, 100 గ్రాములు ఫ్రెష్ క్రీమ్, 2-4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. అనంతరం బయటకు తీసి నూనె పీల్చుకునే కాగిత మీద వేసి పక్కన పెట్టాలి. Step 2 ఇదిలావుండగా.. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టును పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఇదివరకు వేడిచేసుకున్న పాన్’లోనే కొద్దిగా నూనె చేర్చి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించాలి. ఇందులోనే గ్రౌండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. Step 4 కొద్దిసేపు వేయించిన అనంతరం అందులో పెరుగు వేశాక ధనియాలపొడి, జీలకర్రపొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేయాలి. 2 నిముషాల తర్వాత ఇందులో పన్నీర్ వేసి కలియబెట్టుకోవాలి. Step 5 పన్నీర్ కలుపుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, మిరియాలపొడి, గరంమసాలా పొడి వేసి ఆ పాన్’కు మూత పెట్టేసి.. మీడియం మంట మీద వేయించాలి. అంతే! నోరూరించే దమ్ పన్నీర్ కాలీ మిర్చ రెడీ!
Yummy Food Recipes
Add