Hyderabadi Samosa By , 2018-07-12 Hyderabadi Samosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Hyderabadi Samosa making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: గోధుమపిండి పావుకిలో,,ఉల్లితరుగు కప్పు,,ఉల్లిపరక తరుగు పావు కప్పు,,పచ్చిమిర్చి -5,,క్యాబేజీ, క్యారెట్ తురుము పావుకప్పు,,పసుపు చిటికెడు,,ఉప్పు తగినంత,,కొత్తిమీర కొద్దిగా,,నూనె 2 టీ స్పూన్లు, Instructions: Step 1 గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. Step 2 తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక  కొత్తిమీర వేసి దింపేయాలి. Step 3 పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతి సైజులో ఒత్తుకోవాలి. Step 4 పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 5 చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి. Step 6 ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి. Step 7 వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి. అంతే హైదరాబాద్ సమోసా రెడీ
Yummy Food Recipes
Add