fish fried rice By , 2018-01-23 fish fried rice Here is the process for fish fried rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ముల్లు తీసేసిన చేప ముక్కలు - అరకిలో,,వండిన అన్నం - మూడు కప్పులు,,ఉల్లిపాయలు - మూడు,,చిల్లీ సాస్ - రెండు టీ స్పూనులు,,సోయా సాస్ - రెండు టీ స్పూనులు,,పెప్పర్ పౌడర్ - ఒక టీస్పూను,,కార్న్ స్టార్చ్ - ఒక టీ స్పూను,,సన్నగా తరిగిన క్యాప్సికం - ఒక కప్పు,,కొత్తిమీర - ఒక కప్పు,,తురిమిన అల్లం - ఒక టీ స్పూను,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 చేప ముక్కలని నచ్చిన పరిమాణంలో కోయాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటికి తడి పెద్దగా లేకుండా చూసుకోవాలి.  Step 2 ఇప్పుడు చిల్లీ సాస్, సోయా సాస్, పెప్పర్ పొడి ముక్కలకి బాగా అంటేలా కలిపి పావుగంట పాటూ ఉంచాలి. సరిపడినంత ఉప్పు వేసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.  Step 3 చేపముక్కలపై కాస్త కార్న్ స్ట్రార్చ్ పొడి కూడా వేయాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక, అందులో చేపముక్కల్ని ఎర్రగా వేపాలి. వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు అదే పాన్ లో మళ్లీ నూనె వేసి అల్లం వెల్లుల్లి తరుగు‌ని వేపాలి. అందులో నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్ వేసి బాగా వేపాలి.    Step 5 ముందుగా వేపి పెట్టుకున్న చేపలు కూడా వేసి మళ్లీ ఫ్రై చేయాలి. ఇప్పుడు వండిన అన్నాన్ని చేప ముక్కల మిశ్రమంలో వేసి జాగ్రత్తగా కలపాలి. అంతే ఫిష్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.          
Yummy Food Recipes
Add