sorakkai sambar By , 2017-12-01 sorakkai sambar Here is the process for sorakkai sambar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు -1 కప్పు,టమాటాలు - 3,సొరకాయ ముక్కలు - 1 కప్పు (పెద్దగా కట్ చేసినవి),మునక్కాడ - 1,చింతపండు గుజ్జు - 1 కప్పు,పచ్చిమిర్చి - 5,ఉల్లిపాయ ముక్కలు - కొన్ని,వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్,సాంబార్ పొడి - 2 స్పూన్స్,కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా,కారం - సరిపడ,పసుపు - 1/4 స్పూన్,ఉప్పు - సరిపడ,నూనె - 4 స్పూన్స్,పోపు గింజలు - 1స్పూన్, Instructions: Step 1 కందిపప్పు ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టు కోవాలి. తరువాత మునక్కాడ మరియు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 తరువాత ఒక గిన్నెలో సొరకాయ మునక్కాడ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి. Step 3 సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తరువాత చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరో 10 నిముషాలు ఉడికించాలి. Step 4 తరువాత అందులో ఉడికించిన పప్పు వేసి బాగా కలిపి మరో గ్లాస్ నీళ్ళు పోసి, సరిపడ కారం, ఉప్పు, సాంబార్ పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించాలి.    Step 5 ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు, ఎండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి.   Step 6 తరువాత ఈ పోపుని మరుగుతున్న సాంబార్ లో వేసి కలిపి మరో 5 నిముషాలు మరిగించి దించెయ్యాలి.    Step 7 అంతే రుచికరమైన సొరకాయ సాంబార్ తయార్. ఈ సాంబార్ ని వేడి అన్నములో కాని ఇడ్లీలో కాని తింటే చాల రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day