Andhra Chicken Fry Recipe By , 2017-11-26 Andhra Chicken Fry Recipe Here is the process for Andhra Chicken Fry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: 500 గ్రాములు చికెన్,2 మీడియం ఉల్లిపాయల తరుగు,2 పచ్చిమిరపకాయలు,2 tsp అల్లం వెల్లుల్లి ముద్ద,½ tsp పసుపు,2 ½ tbsp కారం,2 tsp ధనియాల పొడి,ఉప్పు తగినంత,50 గ్రాములు పెరుగు,¼ కప్ కొత్తిమీర తరుగు,5 tbsp నూనె,¼ కప్పు నూనెలో వేయించిన జీడిపప్పు, Instructions: Step 1 మారినేషన్ కొరకు చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. Step 2 ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాల నుండి గంట పాటు నానబెట్టాలి. Step 3 ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. Step 4 తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమరపకాయలు వేసి మగ్గే వరకు వేయించాలి.   Step 5 తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.   Step 6 తర్వాత నానబెట్టిన చికెన్ వేసి ఒకసారి కలిపాలి.   Step 7 మూత పెట్టి మీడియం సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.   Step 8 చికెన్ లో ఉన్న తడి మొత్తం ఆవిరైపోయేవరకు ఉడికించాలి.   Step 9 ఎప్పుడైతే నూనె కూర నుండి విడిపోయినట్లుగా కనిపిస్తుందో అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 5 నిమిషాల పాటు ఎక్కువ సెగ మీద కలుపుతూ వేయించాలి.   Step 10 కొత్తిమీర తరుగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day