Gobhi Paratha By , 2017-11-10 Gobhi Paratha Here is the process for Gobhi Paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ పువ్వు - 1,ఉల్లిపాయి - 1,పచ్చిమిర్చి - 2,వాము - కొద్దిగా,ఉప్పు - 1/2 చెంచా,కారం - 1/2 చెంచా,కొత్తిమీర తరుగు - 2 చెంచాలు,నూనె - 1/4 కప్పు,చపాతీపిండి - 1 కప్పు, Instructions: Step 1 ముందుగా చపాతీపిండిలో చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలుపుకుని నాననివ్వాలి. Step 2 కాలీఫ్లవర్‌ను మొగ్గలుగా కట్‌చేసి శుభ్రం చేసుకుని ఫుడ్‌ప్రోసెసర్‌లోగాని.. గ్రేటర్‌లో గాని సన్నగా తరగాలి. Step 3 ఉల్లిపాయి కూడా చాలా చిన్న ముక్కలు తరుగు కోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కారం, వాము, కొత్తిమీర వేసి గోబి మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. Step 4 ఇప్పుడు చపాతీ పిండిని ఉండగా చేసి చిన్న పూరీ మాదిరి ఒత్తుకుని అందులో ఈ గోబి మిశ్రమం వేసి చుట్టూ చేతితో కలుపుతూ మూటలా చేసి రెండు అరచేతుల మధ్య బిళ్ళలా నొక్కాలి.   Step 5 మళ్ళీ పొడి పిండి అద్ది మెల్లగా అప్పడాల కర్రను తేలిగ్గా ఆన్చుతూ పరోటాలు చేసుకుని పెనంపై దోరగా కాల్చి తియ్యాలి.   Step 6 ఈ గోబీ పరోటాలను పుదీనా చట్నీ (లేక) సాస్‌తో తినవచ్చును. ఎంతో రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day