goduma idly recipe By , 2017-07-23 goduma idly recipe Here is the process for goduma idly making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: గోధుమలు - 1 1/2 కప్పు ,,మినప్పప్పు - 1 కప్పు,,నానబెట్టిన బఠాణీ - 1/4 కప్పు ,,క్యారట్ తురుము - 1/4 కప్పు ,,బీన్స్ తరుగు - 1/4 కప్పు,,పెరుగు - 1/2 కప్పు ,,కొత్తిమీర - కొద్దిగా,,కరివేపాకు - రెండు రెమ్మలు,,ఆవాలు - టీ స్పూను ,,మినప్పప్పు - 2 టీ స్పూన్లు,,శెనగపప్పు - 2 టీ స్పూన్లు ,,అల్లం తరుగు - 1 స్పూను ,,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు ,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 గోధుమలను రెండు గంటలు మినప్పప్పును అర గంట నీటిలోనానబెట్టాలి.  Step 2 అలా అవి నానిన తర్వాత గోధుమలను మరీ మెత్తగా కాకుండాకొంచం బరకగా మిక్సీ పట్టాలి.  Step 3 మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి.  Step 4 ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు నాననివ్వాలి. (అంటే మనం ఈ ఇడ్లి వేసుకోవాలనుకనే ముందు రోజు రాత్రి పిండిని తయారు చేసుకుంటే మంచిది).  Step 5 బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.  Step 6 క్యారట్ తురుము, బీన్స్ తరుగు వేసి ఐదారు నిముషాలు ఉంచి తీసేయాలి. నానబెట్టిన పిండిలో వీటిని కలిపి పెరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి బాగా కలపాలి.  Step 7 ఇలా కలిపిన పిండిని ఇడ్లీ రేకులలో వేసి మాములు ఇడ్లీల లాగానే ఉడికించుకోవాలి.  
Yummy Food Recipes
Add