carrot uthappam recipe By , 2017-08-09 carrot uthappam recipe Here is the process for carrot uthappam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బియ్యం.. ఒక కప్పు,మినప్పప్పు.. ఒక టీ.,మెంతులు.. ఒక టీ.,ఉప్పు.. తగినంత,వంటసోడా.. పావు టీ.,పచ్చిమిర్చి.. మూడు,ఉల్లిపాయ..ఒకటి,క్యారెట్ తురుము.. పావు కప్పు,టొమోటో.. ఒకటి,కొత్తిమీర.. కాస్తంత, Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి.  Step 2 మరుసటి రోజు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సుమారు 8 గంటలపాటు ఫ్రిజ్‌లో కాకుండా బయటే ఉంచాలి.  Step 3 పులిసిన పిండిలో ఉప్పువేసి బాగా కలియబెట్టాలి. ఊతప్పం వేయడానికి ముందు మాత్రమే సోడా వేసి కలపాలి. Step 4 పెనం వేడిచేసి ఒక టీస్పూన్ నూనె వేసి పెనమంతా రుద్దాలి.  Step 5 ఇప్పుడు గరిటెతో పిండిని పోసి మందంగా వేయాలి. మరో టీస్పూన్ నూనెని ఊతప్పం చుట్టూ వేయాలి.  Step 6 ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, టొమోటో, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుల్ని వేయాలి. సిమ్‌లో 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత ఊతప్పంను ప్లేటులోకి మెల్లిగా తీయాలి. అంతే క్యారెట్ ఊతప్పం తయార్.   
Yummy Food Recipes
Add