Chicken tikka biryani recipe By , 2017-07-11 Chicken tikka biryani recipe Here is the process for Chicken tikka biryani making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 40min Ingredients: బోన్ లెస్ చికెన్: 1కేజీ,కారం: 2 స్పూన్స్,బాస్మతి రైస్ : 1కేజీ,అల్లం పేస్ట్: ఒక టీస్పూన్,పెప్పర్ పొడి: ఒక టీస్పూన్,నిమ్మరసం: ఒక టీస్పూన్,పచ్చిమిర్చి పేస్ట్ : 3 టీస్పూనులు,చెక్క : తగినంత,ఉప్పు: తగినంత,నెయ్యి : 2 టీ స్పూన్లు,పెరగు : 1 కప్పు,పాలు: ఒకటిన్నర కప్పు,నూనె : సరిపడా,వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్,పసుపు: అర టీ స్పూన్,చాట్ మసాలా : ఒక టీస్పూన్,ఉల్లిపాయలు: 2,టమోటో: 2,లవంగాలు: 5,యాలకులు: 4,ఫుడ్ కలర్ (పసుపు రంగు) : 1/4టీస్పూను,కుంకుమ పువ్వు : చిటికెడు,బిర్యానీ ఆకు : 2, Instructions: Step 1 ముందుగా పెద్ద గిన్నె తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, చాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని 2 గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టాలి.  Step 2 ఆ తరువాత బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత ఒక కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె,నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.  Step 4 ఆ తరువాత టమోటో వేసి చిక్కటి గ్రేవి వచేవరకు ఉడికించాలి.  Step 5 ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి, నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి10 నిముషాలు ఉడకనివ్వాలి.  Step 6 చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆపేసి, తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టిన బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మరగనివ్వాలి.  Step 7 నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.  Step 8 ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఉడికిన అన్నం ఒక లేయర్ లా వేసి తర్వాత చికెన్ ఒక లేయర్ గా వేసుకుని కుంకుం పువ్వు వేసి నానపెట్టుకున్న పాలను ఈ లేయర్స్ మీద వేసుకుని స్టవ్ పై 5 లేక 10 నిముషాలు మూత పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి.  Step 9 10 నిమషాల తరువాత వేడి వేడి చికెన్ టిక్క బిర్యానీ సర్వ్ చేయడానికి రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day