Aloo paneer kofta curry By , 2014-07-21 Aloo paneer kofta curry Aloo paneer kofta curry is a delicious vegetarian recipe which is a must try. its a best rice combination, its a good for health, aloo panner kofta curry preparation....... Prep Time: Cook time: 1hour Ingredients: 2 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరతరుగు, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ సోంపు, అర టీస్పూన్ గరమసాల, పావుటీ స్పూన్ గరంమసాల పొడి, అర టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఛాట్ మసాల, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ బాదంపొడి, 1 టేబుల్ స్పూన్ టమాట గుజ్జు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిర్యాని ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మిక్స్ డ్ డ్రై ఫ్రూట్ (సన్నగా తరగాలి), 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 3 బంగాళదుంప, 200 గ్రా. పన్నీర్ తరుము, Instructions: Step 1 లడ్రై ఫ్రూట్స్ మరియు నూనె తప్ప మిగిలిని పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. Step 2 తర్వాత ఉడికించుకొన్న పంగాళదుంపలను బాగా చిదిమి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలుకట్టకుండా ఉంటుంది. Step 3 తర్వాత మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి పెట్టుకన్న పదార్థాల్లో చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్బాల్స్ గా తయారుచేసి, అరచేతిలో పెట్టుకొని వడలా చిన్న సైజులో తట్టుకోవాలి. Step 4 తర్వత మద్యలో డ్రై ఫ్రూట్స్ ను ఒక టేబుల్ స్పూన్ వేయాలి. Step 5 ఇప్పుడు చివర్లు కవర్ చేస్తూ డ్రైఫ్రూట్స్ ను కనపడకుండా అన్ని వైపుల నుండి మడిచి పెట్టుకోవాలి. (ఫుల్ గా కవర్ చేయాలి)ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్ బయటకు రాకుండా ఉంటాయి. Step 6 ఇలా అన్నికోఫ్తాలను తయారుచేసుకోవాలి. Step 7 తర్వాత డీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి, వేడయ్యాక ఆ నూనెలో కోఫ్తాలను జాగ్రత్తగా నిదానంగా వదిలో అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.. Step 8 ఇలా అన్ని కోప్తానలు తయారుచేసి పెట్టుకొన్న తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 9 పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి. Step 10 తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఛాట్ మసాల, బ్లాక్ పెప్పర్ పౌడర్, సోంపు పొడి, గరం మసాలా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. Step 11 తర్వాత అందులో టమోటో గుజ్జువేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి. Step 12 తర్వాత అందులో బాదం పొడి, ఉప్పు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి. Step 13 తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీలో కోప్తాలను వేయాలి. నిదానంగా కలిబెట్టి మొత్తంమిశ్రమాన్ని ఉడకనివ్వాలి. Step 14 గ్రేవీ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ పన్నీర్ కోప్తాకర్రీ రెడీ . ఇది రైస్, అదే విధంగా రోటిలకు చాలామంచి కాంబినేషన్.
Yummy Food Recipes
Add