mushroom pepper fry recipe By , 2017-06-17 mushroom pepper fry recipe Here is the process for mushroom pepper fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మష్రూమ్స్‌ - 250 గ్రాములు,,గ్రీన్‌ క్యాప్సికమ్‌ (తరిగి) - 1,,ఉల్లిగడ్డ (తరిగి) - 1,,పచ్చిమిరపకాయలు - 2,,వెల్లుల్లి రెబ్బలు - 3,,అల్లం - అర అంగుళం ముక్క,,నిమ్మ రసం - 1 టీస్పూన్‌,,కరివేపాకు - ఒక రెబ్బ,,మిరియాల పొడి - 3/4 టేబుల్‌ స్పూన్‌,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 కాడలు తీసిన మష్రూమ్స్‌ను ఉప్పు వేసిన వేడి నీళ్లలో వేయాలి.  Step 2 ఒక నిమిషం తర్వాత వాటిని ఒక మెత్తటి వస్త్రంలోకి తీసుకుని.. తడారిపోయే వరకు వత్తాలి. Step 3 పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి, ఉల్లి, అల్లం ముక్కలు వేసి సన్నటి మంట మీద వేగించాలి.  Step 4 చివర్లో కరివేపాకు వేయాలి. ఇందులో క్యాప్సికమ్‌ ముక్కలు వేసి నాలుగైదు నిమిషాలు వేగించాలి.    Step 5 మష్రూమ్‌ ముక్కలను పాన్‌లో వేసి దానిపై మూత ఉంచి తక్కువ సెగకు కాసేపు ఉంచాలి.    Step 6 చివరగా మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌ ఆర్పేశాక నిమ్మరసం పిండాలి.    Step 7 కొత్తిమీరతో అలంకరించాలి. ఈ ఫ్రై చపాతీలోకి వేడి వేడిగా తింటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add