Healthy mushroom egg fried rice. By , 2016-12-02 Healthy mushroom egg fried rice. healthy tasty mushroom egg fried rice recipe. Prep Time: 10min Cook time: 25min Ingredients: మష్రుమ్ - 10 to 15 (ముక్కలుగా చేసి పెట్టుకున్నది),గుడ్లు - 2,అన్నం - 1 కప్పు నిండా,పచ్చిమిర్చి - 5 నుంచి 6 (తరిగినది),అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్,వెనిగర్ - 1 స్పూన్,స్ప్రింగ్ ఆనియన్ - 1 కప్పు,చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్,టమోటో సాస్ - 1 టేబుల్ స్పూన్,సోయాసాస్ - 1 స్పూన్,జీలకర్ర - 1/2 స్పూన్, కొత్తిమీర - 1/2 cup (తరుగు,ఉప్పు- రుచికి సరిపడా నూనె- తగినంత, Instructions: Step 1 పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి. Step 2 తర్వాత అందులో పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. Step 3 ఇప్పుడు అందులో మష్రుమ్ మరియు గుడ్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. Step 4 తర్వాత సాస్ లు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు అలాగే సోక్ చేయాలి. Step 5 తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్న వేసి మొత్తం మిశ్రమం కలగలిసేలా మిక్స్ చేస్తూ చేసుకోవాలి. Step 6 ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే వెనిగర్, రుచికి సరిపడా కొద్దిగా ఉపు వేసి మిక్స్ చేసుకోవాలి. Step 7 గార్నిషిగ్ కోసం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి . అంతే హెల్తీ అండ్ టేస్టీ మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ... సాస్ తో లాగించేయటమే...
Yummy Food Recipes
Add