jack fruit masala balls recipe By , 2017-05-24 jack fruit masala balls recipe jack fruit masala balls , Food, food recipes Prep Time: 15min Cook time: 20min Ingredients: ఉడికించి నలిపించు కున్న పనస (జాక్‌ఫ్రూ ట్‌) ముక్కలు : అర కప్పు),ఉడికించి నలిపి ఉంచిన బంగాళాదుంప ముక్కలు : అర కప్పు,బరకగా నూరిన వేరుశెనగ గింజల పొడి : 1 టీస్పూన్‌,ఉల్లిపాయ తరుగు :: అర కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : ఒక టీస్పూన్‌,స్కిమ్‌డ్‌ మిల్క్‌ : అర కప్పు,పసుపుపొడి : ఒక టీస్పూన్‌,బ్లాక్‌ పెప్పర్‌ పొడి : ఒక టీస్పూన్‌,జీలకర్ర పొడి : ఒక టీస్పూన్‌,ధనియాలపొడి : ఒక టీస్పూన్‌,కొత్తిమీర తరుగు : ఒక టీస్పూన్‌,నూనె : ఒక టీస్పూన్‌,పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్‌,ఉప్పు : ఒక టీస్పూన్‌, Instructions: Step 1 ఒక నాన్‌స్టిక్‌ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి.  Step 2 అందులో బ్లాక్‌ పెప్పర్‌, ధనియాల పొడి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి. Step 3 ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలియబెట్టాలి.  Step 4 ఇందులోనే వేరుశెనగ గింజల పొడి, పసుపుపొడి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి.    Step 5 తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.   Step 6 చివరగా స్కిమ్‌డ్‌ మిల్క్‌ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి.    Step 7 మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి.    Step 8 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారిన తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్‌ చేయాలి.    Step 9 అంతే రుచికరమైన జాక్‌ఫ్రూట్‌ పొటాటో బాల్స్‌ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day