Nimmakya pulihora recipe By , 2017-03-20 Nimmakya pulihora recipe Here is the process for Nimmakya pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం - 1 కప్పు,,నిమ్మకాయ - 1,,పచ్చిమిర్చి - 2,,ఉప్పు- తగినంత,,పసుపు - 1/4 టీస్పూను,,అల్లం - 1/4 అంగుళం,,జీడిపప్పు- 10,,పల్లీలు (సెనగకాయ పప్పులు) - 2 టేబుల్ స్పూన్లు,,నూనె - 2 టేబుల్ స్పూన్లు.,తాలింపు కొరకు :,ఆవాలు - 1/4 టీస్పూను ,,జీలకర్ర - 1/4 టీస్పూను ,,ఇంగువ -చిటికెడు ,,పచ్చిసెనగపప్పు - 1/2 స్పూను ,,ఎండుమిర్చి- 2,,మినపప్పు - 1/2 స్పూను,,కరివేపాకు - 2 రెమ్మలు., Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రపరుచుకుని, కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి(కుక్కర్ / రైస్ కుక్కర్ లో ఉడికించుకున్న పర్వాలేదు). ఉడికిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ ఆరపెట్టుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాక తాలింపుకు సిద్దంచేసుకోవాలి. Step 2 ఒక చిన్న కడాయిలో నూనె పోయాలి.  Step 3 నూనె వేడి అయ్యాక ఇంగువ, తాలింపు సామాను, జీడిపప్పు, పల్లీలు,సన్నగా తరిగిన అల్లం మరియు పచ్చిమిర్చి(మధ్యకి నిలువుగా కోసుకోవాలి ) వేయ్యాలి. పప్పులన్నీ ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. Step 4 వేగిన పప్పులలో పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Step 5 ఆరబెట్టిన అన్నంలో ఈ పప్పుల తాలింపు, ఉప్పు మరియు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి . అంతే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day