Cauliflower potato Fry recipe By , 2017-10-27 Cauliflower potato Fry recipe Here is the process for Cauliflower potato Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యాలీఫ్లవర్ - ఒకటి,ఆలూ - రెండు,ఉల్లిపాయ - ఒకటి,పచ్చిమిర్చి - రెండు,కరివేపాకు - ఒక రెమ్మ,కొత్తిమీర - ఒక కట్ట,అల్లం - చిన్న ముక్క,వెల్లులి - నాలుగు రెబ్బలు,గరం మసాలా - అర టీ స్పూన్,ఉప్పు, కారం,పసుపు, నూనె, తాలింపు దినుసులు., Instructions: Step 1 ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకోవాలి, క్యాలీఫ్లవర్ ని చిన్న చిన్న పువ్వులుగా చేసి వేడినీళ్ళలో కడగాలి. *ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి క్యాలీఫ్లవర్ విడివిడి పువ్వులను వేడి నీళ్ళలో వేస్తే పురుగులు బయటపడిపోతాయి. వాటిని తీసిపారేయాలి. Step 2 ఆ తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఆలూ ముక్కలతో కలిపి కొంచెం ఉడికించి వార్చాలి.  Step 3 తరువాత ఒక బౌల్లో  నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. Step 4 అల్లం, మిర్చి, వెల్లుల్లి కలిపి గ్రేడ్ చేసుకొని ఈ పేస్ట్ వేసి వేయిచాలి.  Step 5 ఇప్పుడు ఉడికించిన ఆలూ, క్యాలీఫ్లవర్ వేసి కలపాలి.  Step 6 తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాకా వేయించాలి, చివరిగా గరంమసాలా, కొత్తిమీర వేసి కలపాలి. అంతే, మనకి బాగా నచ్చే క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ.    
Yummy Food Recipes
Add