Ghosh ka dalcha recipe By , 2017-09-22 Ghosh ka dalcha recipe Here is the process for Ghosh ka dalcha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: శనగపప్పు - 200 గ్రా.;,నూనె - పావు కిలో,షాజీరా - టేబుల్ స్పూను,దాల్చినచెక్క - అర టీ స్పూను,లవంగాలు - 10; ఏలకులు - 10,ఉల్లితరుగు - 100 గ్రా.; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.,కారం - 100 గ్రా.; కరివేపాకు - నాలుగు రెమ్మలు,పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి),మిరియాలపొడి - టీ స్పూను,కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి),సొరకాయ ముక్కలు - 500 గ్రా.,టొమాటో ముక్కలు - 400 గ్రా.,చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి),ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు,జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు,పుదీనా - చిన్న కట్ట,మటన్ ముక్కలు - 500 గ్రా., Instructions: Step 1 శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి. మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.  Step 2 బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి. ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.  Step 3 కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.  Step 4 ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.   Step 5 సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.    Step 6 చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి.    Step 7 ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day