Capsicum Rice Recipe By , 2017-11-10 Capsicum Rice Recipe Here is the process for Capsicum Rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఒక కప్పు బియ్యంతో అన్నం వండుకోవాలి.,కాప్సికం – 3,నిమ్మకాయ – 1,వాంగీబాత్ పొడి – 3 టేబుల్ స్పూన్‌లు,జీడిపప్పు – 10-12,ఉప్పు తగినంత,నూనె – 3 టేబుల్ స్పూన్‌లు,పోపుకు ( ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు,కరివేపాకు ), Instructions: Step 1 ముందుగా క్యాప్సికంని సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో పోపుకు సరిపడినంత నూనె తీసుకొని నూనె కాగాక దానిలో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.  Step 3 పోపు వేగాక జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించాలి.  Step 4 ఈ పోపులో ముందుగా తరిగి పెట్టకున్న క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.    Step 5 ఇలా క్యాప్సికం ముక్కలు ఉడికిన తరువాత చివర్లో వాంగీబాత్ పొడి వేసి దింపెయ్యాలి. * దీనిలో చల్లారిన అన్నం.. కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపాలి.                  
Yummy Food Recipes
Add