masala chicken recipe cooking tips side dish By , 2015-01-05 masala chicken recipe cooking tips side dish masala chicken recipe cooking tips side dish : the cooking tips to make masala chicken recipe which is very tasty, spicy. Prep Time: 30min Cook time: 1hour 15min Ingredients: 3/4 (ముప్పావు) కేజీ చికెన్ ముక్కలు, 2 టీ స్పూన్స్ ఆలీవ్ ఆయిల్, 1-2 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్స్ వెల్లుల్లి ముద్ద, 2 టీ స్పూన్స్ అల్లం ముద్ద, 2 టీ స్పూన్స్ పసుపు, 1 టీ స్పూన్ మెంతిపొడి, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరంమసాలా, ఒక కప్ ఉడికించిన చికెన్ నీళ్లు, అరకప్పు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు, సరిపడా నూనె, Instructions: Step 1 ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత.. ఒక పాత్రలో వేసి, నీళ్లు పోసి కొద్దిసేపు వేయించుకోవాలి. అనంతరం ఆ ఉడికించిన చికెన్ ముక్కలకు పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో కొద్దిగా ఆలీవ్ నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో పసుపు పట్టించిన చికెన్ ముక్కలను వేసి, రెండువైపులా వేగేదాకా వేయించాలి. తరువాత క్రిందకు దించేయాలి. Step 3 ఇప్పుడు మరో బాణలి తీసుకని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, మెంతిపొడి వేసి బాగా వేయించాలి. Step 4 కాసేపు తర్వాత అందులోనే కారం, గరంమసాలా, ఉడికించిన చికెన్ నీళ్లు, కొబ్బరిపాలు పోసి కలుపుకోవాలి. 5 నిముషాల తర్వాత వేయించిన చికెన్ ముక్కలు, ఉప్పు వేసి 45 నిముషాలపాటు ఉడికించాలి. కూర బాగా ఉడికిన అనంతరం ఒక గిన్నెలోకి వేసుకుని.. పుదీనా, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే!
Yummy Food Recipes
Add