chana dal pudding senaga pappu payasam recipe cooking tips By , 2015-01-03 chana dal pudding senaga pappu payasam recipe cooking tips chana dal pudding senaga pappu payasam recipe cooking tips : the cooking tips to make senaga pappu payasam recipe. Prep Time: 20min Cook time: 20min Ingredients: 1/2 కప్ శెనగపప్పు, 10 బాదంపప్పులు, రెండున్నర కప్పులు పాలు, ఒకటిన్నర కప్పు పంచదార, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు వంట కర్పూరం, Instructions: Step 1 ఒక బాణలి తీసుకుని అందులో నూనె వేయకుండానే శెనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వాటిని చల్లార్చుకొని కొద్దిసేపటివరకు నీటిలో నానబెట్టుకోవాలి. మరోవైపు బాదంపప్పును వేడినీటిలో నానబెట్టాలి. Step 2 కొద్దిసేపటి తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో బాదంపప్పు పొట్టుతీసేసి వేయాలి. అలాగే నీటిలో నానబెట్టిన శెనగపప్పును కూడా అందులో వేసి ఆ రెండింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఇప్పుడు మీడియం మంటమీద ఒక పాత్రను వుంచి అందులో రెండు కప్పుల నీరు కొద్దిసేపు వేడిచేసిన తర్వాత అందులో ఆ పప్పుల మిశ్రమాన్ని వేసి.. వుండలు రాకుండా తిప్పుతూ వుండాలి. Step 4 ఇలా వేడిచేస్తుండగానే పప్పునుంచి పచ్చి వాసన పోయిన అనంతరం అందులో పంచదార కలుపుకోవాలి. పంచదార కరిగేంతవరకు అందులో పాలను కలిపి.. మూడు నిముషాల తర్వాత కిందకు దించేయాలి. Step 5 చివరగా వంట కర్పూరం, యాలకుల పొడిని ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే! హాట్ హాట్ శెనగపప్పు పాయసం సర్వ్ చేసుకోవడానికి రెడీ!
Yummy Food Recipes
Add