potato ball recipe cooking tips evening snacks special By , 2014-12-30 potato ball recipe cooking tips evening snacks special potato ball recipe cooking tips evening snacks special : the cooking tips to make potato ball recipe. It is simple to make within minutes. Prep Time: 25min Cook time: 15min Ingredients: 3-4 బంగాళదుంపలు (మీడియం సైజ్’లో కట్ చేయాలి), 1 కప్ క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుము, 1-2 గుడ్లు, 1/2 కప్ సన్న సేమ్యా, వేయించడానికి సరిపడా నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలను నీటిపాత్రలో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అనంతరం క్రిందకు దించేసి చల్లారిన తర్వాత ముద్దగా చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి. Step 2 మరోవైపు క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుములను ఒక కప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు కలిపి మరోసారి కలియబెట్టుకోవాలి. Step 3 ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్డుసొన వేసి బాగా గిలక్కొట్టుకుని వుంచుకోవాలి. అలాగే ఒక ప్లేట్’లో సన్న సేమ్యాను తీసుకుని పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు అరచేతికి నూనె రాసుకుని.. ఇదివరకు ముద్దగా చేసుకున్న బంగాళదుంపను కొద్దిగా తీసుకుని పరుచుకోవాలి. ఆ ముద్ద మధ్యలో ఇదివరకు కలుపుకున్న కూరగాయల తురుమును వేసి.. ఆ ముద్దను మూసేసి బాల్స్’లా చేసుకోవాలి. Step 5 ఇలా బాల్స్’లా చేసుకున్న ఈ పొటాటో ముద్దలను గుడ్డుసొనలో దొర్లించాలి. అలాగే ప్లేటులో పరుచుకున్న సేమ్యాలో కూడా దొర్లించి పక్కన పెట్టుకోవాలి. Step 6 ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు తయారుచేసిన పొటాటో ముద్దలను వేసి, బంగారు రంగులో వచ్చేవరకు వేయించాలి. అంతే! పొటాటో బాల్స్ రెడీ!
Yummy Food Recipes
Add