vankaya senagapappu kura By , 2018-07-07 vankaya senagapappu kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty vankaya senagapappu kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: వంకాయలు 250 గ్రా.లు,సెనగపప్పు 50 గ్రా.లు,ఉల్లిపాయ 1,కరివేపాకు 2 రెబ్బలు,అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,గరంమసాలా పొడి 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 సెనగపప్పు కడిగి నీళ్ళుపోసి అరగంట నానబెట్టాలి. వంకాయలు ముక్కలుగా తరిగి.. ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి.  Step 2 గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.  Step 3 ఇందులో పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లిముద్ద, కారంపొడి వేసి కొద్దిగా వేపి నానిన  సెనగపప్పు వేయాలి. Step 4 పప్పు తడి పోయేవరకు నిదానంగా వేపి ఇందులో వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.  Step 5 అవసరమైతే అరకప్పు నీళ్ళు వేసుకోవచ్చు. వంకాయ ముక్కలు, సెనగపప్పు, పూర్తిగా ఉడికిన నీరంతా ఇగిరి పోయాక గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day