vankaya pachi masala kura By , 2018-07-07 vankaya pachi masala kura Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty vankaya pachi masala kura making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: తెల్ల వంకాయలు 250 గ్రా.లు,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 5,పసుపు 1/4 టీస్పూన్,జీలకర్ర 1 టీస్పూన్,కొబ్బరిపొడి 3 టీస్పూన్లు,పల్లీలు 3 టేబుల్ స్పూన్లు,నువ్వులు 2 టీస్పూన్లు,మెంతులు 1/4 టీస్పూన్,పెరుగు 1/2 టీస్పూన్,అల్లంవెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 4 టీస్పూన్లు,కొత్తిమీర కొద్దిగా,జీలకర్ర, మెంతులు 1/4 టీస్పూన్, Instructions: Step 1 ఈ కూర తెల్ల వంకాయలతో చేస్తే బావుంటుంది. ముందుగా గిన్నె లేదా కడాయి వేడి చేసి జీలకర్ర, నువ్వులు, మెంతులు, పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలి.  Step 2 అందులో రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి.  Step 3 ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి  ముద్ద, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి Step 4 కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి మెత్తగా గుత్తులుగా లేదా పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి Step 5 ముక్కలు కాస్త మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. Step 6 ఉడికి నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day