hot noodles recipe making breakfast special food By , 2014-12-11 hot noodles recipe making breakfast special food hot noodles recipe making breakfast special food : This is the best breakfast to make very fast and eat for those who doesn't have time to eat in the mornings Prep Time: 20min Cook time: 15min Ingredients: 10 గ్రాములు నూడిల్స్, 1 - 2 ఉల్లిపాయలు (సన్నగా తరగాలి), 1 - 2 టమోటా (సన్నగా తరగాలి), 1 - 2 క్యారెట్ (సన్నగా తరగాలి), 2 టీ స్పూన్స్ పచ్చిబఠానీ, 1/2 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ సోయాసాస్, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్ నీళ్లు, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్’లో వచ్చేవరకు ఫ్రై చేయాలి. కలర్ మారిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగించాలి. అనంతరం అందులోనే కట్ చేసిన టమోటా ముక్కలు కూడా వేసి వేగించాలి. ఇవన్నీ మెత్తగా అయ్యేంతవరకు మీడియం మంట మీద ఉడికించాలి. Step 2 ఆ మిశ్రమం మెత్తబడిన తరువాత అందులో కొద్ది నీళ్లు పోసి మరో ఐదునిముషాలు మరగించాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు పచ్చిబఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి మాంచి వేడి మీద వేగించాలి. బాగా వేడయ్యాక అందులో నూడిల్స్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ మరగించాలి. నూడిల్స్ బాగా ఉడుకుతున్నప్పుడు అందులో కాస్త పంచదార చిలకరించి ఉడికించాలి. Step 3 ఇలా చేసిన తరువాత ఆ పాత్రకు మూతపెట్టి, ఆవిరిమీద ఉడికేలా చేయాలి. 5 నిముషాల తర్వాత మూత తీసి సోయాసాస్, నిమ్మరసం జోడించి మిక్స్ చేయాలి. అప్పుడు నూడిల్స్ సాఫ్ట్’గా ఉడికిన తరువాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే! హాట్ హాట్ నూడిల్స్ రెడీ!
Yummy Food Recipes
Add