khajoor payasam By , 2018-04-15 khajoor payasam Here is the process for khajoor payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కర్జూరాలు - 3/4 కప్పు,,పాలు - రెండు కప్పులు,,నీళ్లు - ఒకటిన్నర కప్పు,,నెయ్యి - ఒక టీస్పూన్‌,,జీడిపప్పు పలుకులు - పన్నెండు,,ఎండుద్రాక్షలు - అరటేబుల్‌ స్పూన్‌,,యాలకలపొడి - అర టీస్పూన్‌., Instructions: Step 1 కర్జూరాల్లో గింజలు తీసి సన్నటి ముక్కలుగా తరగాలి. కర్జూరాలు ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచినట్టయితే వాటిని ముందు రోజు బయట పెట్టాలి.  Step 2 ఒక గిన్నెలో పాలు వేడిచేయాలి. మరో పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్షలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించి పక్కన పెట్టాలి.  Step 3 అదే పాన్‌లో కర్జూర తరుగు వేసి ఓ నిమిషం పాటు వేగించాలి. తరువాత నీళ్లు పోసి కర్జూర ముక్కలు గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి.  Step 4 దాన్ని అలానే సన్నటి మంట మీద ఉంచితే పదినిమిషాల్లో చిక్కపడుతుంది. చిక్కపడిన మిశ్రమంలో పాలు పోసి బాగా ఉడికించాలి.  Step 5 చివర్లో వేగించిన జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్షలు, యాలకలపొడి వేసి మరో ఐదు నిమిషాలు సన్నటి మంట మీద ఉంచితే కర్జూర పాయసం రెడీ. Step 6 చల్లగా, వేడిగా ఎలా అయినా తినొచ్చు.   
Yummy Food Recipes
Add
Recipe of the Day