kidney beans pulao recipe making healthy breakfast By , 2014-12-11 kidney beans pulao recipe making healthy breakfast kidney beans pulao recipe making healthy breakfast : the kidney beans pulao recipe is the healthy breakfast which can improve the immunity level to work better in the whole day. Prep Time: 30min Cook time: 20min Ingredients: 1 కప్ కిడ్నీ బీన్స్ (రాజ్మా), 2 - 3 గ్లాసులు బియ్యం, 2 - 4 టమాటోలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 -3 ఉల్లిపాయలు (సన్నగా తరిగి పెట్టుకోవాలి), 6 - 8 పచ్చిమిర్చి (సన్నగా కట్ చేసుకోవాలి), 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరంమసాలా, 4 -6 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 కిడ్నీ బీన్స్ (రాజ్మా గింజలు)లను నీటిలో బాగా కడిగిన తర్వాత దాదాపు ఐదారు గంటలవరకు నానబెట్టుకోవాలి. (నిద్రపోయేముందు నానబెడితే మంచిది) Step 2 అలా నానబెట్టిన తర్వాత నీటిని పడేసి, శుభ్రంగా కడిగిన అనంతరం వాటిని కుక్కర్’లో వేసి, కాస్త ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగానే మరోవైపు బియ్యాన్ని కడిగి, పక్కన పెట్టుకోవాలి. Step 3 స్టౌవ్ ఒక పాన్ తీసుకుని అందులో కాస్త నెయ్యి వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో గరంమసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అనంతరం అల్లువెల్లిల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాలపొడి, పుదీనా తదితర పదార్థాలు వేసి కొద్దిసేపటివరకు ఫ్రై చేసుకోవాలి. Step 4 ఫ్రై అయిన తర్వాత అందులో టమోటా ముక్కలు, ఇదివరకు ఉడికించిన రాజ్మా వేసి బాగా కలియబెట్టాలి. మరో 10 నిముషాల వరకు వేడి చేయాలి. దీంతో రాజ్మా కూర తయారవుతుంది. Step 5 ఇప్పుడు పులావ్ విషయానికొస్తే.. ఒక పాత్ర తీసుకొని అందులో ఐదుగ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. పొంగుతున్న సమయంలో అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసి కాసేపు మూతపెట్టి వేడి చేయాలి. మూడొంతులు ఉడికిన తర్వాత అన్నాన్ని దించేయాలి. Step 6 ఒక గిన్నెలో సగం అన్నాన్ని పొరలా వేసి వుంచాలి. దానిమీద ఇదివరకు చేసుకున్న రాజ్మా కూరను వేయాలి. అనంతరం మళ్లీ మిగిలిన అన్నాన్ని వేసి.. కాసేపు స్టౌవ్ మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పులావ్’ను కిందకు దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! రాజ్మా పులావ్ రెడీ!
Yummy Food Recipes
Add