cauliflower-rice By , 2018-04-12 cauliflower-rice Here is the process for cauliflower-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాలీఫ్లవర్ - 2 cups,రైస్- 2 cups,పచ్చిబఠానీలు - 1/2 cup,పచ్చిమిర్చి - 5 (సన్నగా తరిగినవి),జీలకర్ర - 1/4th teaspoon,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1/4th tspn,గరం మసాలా - 1/4th teaspoon,కొత్తిమీర తరుగు - 1/4th teaspoon,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి.  Step 2 తర్వాత పాన్ లో కొద్దిగా నీళ్ళు, పసుపు మరియు ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత నీరు వంపేసి కాలీఫ్లవర్ ను పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు తిరిగా కాలీఫ్లర్ ను మంచి నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి.  Step 4 పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 5 మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పచ్చిబఠానీలు వేసి ఫ్రై చేసుకోవాలి. Step 6 ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్ ను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక సారి వేగిన తర్వాత అందులోనే రైస్ వేసి ఫ్రై చేయాలి. Step 7 మొత్తం మిశ్రమం కలగలిసేటప్పుడు 1/4చెంచా గరం మసాలా మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.  Step 8 చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే యమ్నీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ . దీన్ని లంచ్ లేదా డిన్నర్ కు సర్వ్ చేయవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day