mutton kadai recipe making weekend special curry By , 2014-12-10 mutton kadai recipe making weekend special curry mutton kadai recipe making weekend special curry : It is easy to make this recipe in the weekends which is more tastiest than other curries. Prep Time: 30min Cook time: 25min Ingredients: 350 గ్రాములు మటన్, 2 బిర్యానీ ఆకులు, 1/4 కప్ ఉల్లిపాయ పేస్ట్, 2 లేదా 3 టొమాటోలు (సన్నగా కట్ చేసుకోవాలి), 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 కప్ పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, 3 పచ్చిమిర్చి, Instructions: Step 1 మటన్ ముక్కలను నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత పెరుగు, ఉప్పుతో మ్యారినేట్ చేసి 30 నిముషాలవరకు పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ తీసుకొని అందులో కాస్త నూనె వేసి, వేగించాలి. వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. తర్వాత దానిని ఒక ప్లేట్’లోకి తీసుకుని పక్కన వుంచుకోవాలి. Step 3 అదే పాన్’లోనే కాస్త నూనెను జోడించుకుని వేడి చేయాలి. వేడయ్యాక అందులో మటన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. Step 4 అదే పాన్’లోనే మరికొద్దిగా నూనె పోసి, అందులో జీలకర్ర వేసి వేగించాలి. అనంతరం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొద్దిసేపటివరకు వేడి చేయాలి. వేడయ్యాక అందులోనే అల్లు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించాలి. ఆ తర్వాత టొమాటో, ధనియాలపొడి, గరంమసాలా, కారం, పసుపు తదితర పదార్థాలు వేసి.. ఆ మిశ్రమాన్ని బాగా కలియబెడుతూ... మరో 10 నిముషాలవరకు వేగించాలి. Step 5 అలా బాగా ఫ్రై చేసిన అనంతరం అందులో ఇదివరకే మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. 20 నిముషాల వరకు మీడియం మంట మీదే పెట్టాలి. Step 6 మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఫ్రైచేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఫిక్స్ చేయాలి. అంతే.. ఈ విధంగా మటన్ కడై రిసిపీని తయారుచేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day