semya chiken biryani By , 2018-03-27 semya chiken biryani Here is the process for semya chiken biryani making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: సేమ్యా : 250 గ్రాములు,చికెన్ : 500 గ్రాములు.,నెయ్యి, ఉప్పు : సరిపడ.,అల్లం : చిన్న ముక్క,పచ్చిమిర్చి : 2 లేదా 3,ఉల్లి పాయలు : 5,గరం మసాలా : 2 స్పూన్లు,లవంగాలు : 5,జీడిపప్పు : మీకు తోచినన్ని.,వెల్లుల్లి రెబ్బలు : 6,యాలుకలు : 5,కరివేపాకులు : 3 రెమ్మలు.,టమాటాలు : 4,కొత్తిమీర : అరకట్ట,కారం, పసుపు, కిస్మిస్ : సరిపడ.,కారం : రెండు స్పూన్లు,సోయాబిన్ సాస్ : రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా కావల్సిన సైజుల్లో చికెన్ ముక్కలను కట్ చేసుకుని వాటిని నీటిలో శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి.  Step 2 ఆ తర్వాత బాండిల్‌లో నెయ్యి వేసి.. సేమ్యాను దోరగా వేయించాలి. Step 3 ఆ తర్వాత జీడిపప్పులు, కిస్మిస్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టండి. అలాగే, మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలగలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 4 అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.    Step 5 ఇవన్నీ దోరగా వచ్చిన తర్వాత ఇపుడు సిద్ధం చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు, టమోటా ముక్కలు వేసి ఒకసారి కలిపి దీనిలో కారం, గరం మసాల, ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు మూత వేసి ఉంచాలి.    Step 6 ఆ తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యా వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి.    Step 7 నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్, సోయాబిన్ సాస్ వేసి కలిపితే సేమ్యా బిర్యానీ రెఢీ.    Step 8 దీనికి కొత్తిమీర వేసి వడ్డిస్తే బిర్యానీ సిద్ధం.          
Yummy Food Recipes
Add
Recipe of the Day