Tapeswaram Madata Kajalu By , 2018-02-10 Tapeswaram Madata Kajalu Here is the process for Tapeswaram Madata Kajalu making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 25min Ingredients: మైదా: కిలో,పంచదార: కిలోన్నర,నూనె: తగినంత,యాలకులపొడి: కొద్దిగా., Instructions: Step 1 మైదాలో ముందుగా కొద్దిగా నూనె వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండికన్నా కాస్త గట్టిగా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి.  Step 2 ఆ సమయంలో పంచదారలో మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించి లేతపాకం రానిచ్చి యాలకులపొడి కలిపి ఉంచాలి. పిండి ముద్దను పెద్ద ఉండలుగా చేసి పలుచని చపాతీలా వత్తాలి.  Step 3 చపాతీ వత్తేటప్పుడు పొడి పిండి చల్లుతూ చేస్తే అంటుకోకుండా ఉంటుంది. ఈ చపాతీని మళ్లీ సగానికి మడిచి వత్తేయాలి. Step 4 దానిమీద మళ్లీ పొడి పిండిని చల్లి చాపలా చుట్టాలి. ఈ చాపచుట్టలో ఎన్ని పొరలు వస్తే కాజా అంత బాగుంటుంది.    Step 5 ఈ చుట్టను అర అంగుళం వెడల్పు ముక్కలుగా కోయాలి. ఇలా అన్ని ముక్కలనూ కోసుకుని ఒక్కో ముక్కనీ వేలుతో వత్తి, మళ్లీ పొడవుగా వచ్చేలా అప్పడాలకర్రతో వత్తాలి.    Step 6 ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో సన్న సెగమీద వేయించాలి. వేగాక పాకంలో వేసి మునిగేలా చేసి ఓ పది నిమిషాలు ఉంచి తీసి పళ్లెంలో పెట్టి ఆరనివ్వాలి. మరో పదిహేను నిమిషాల తరవాత పాకంలో మరోసారి ముంచి తీయాలి.          
Yummy Food Recipes
Add