gongura prawns curry By , 2018-01-16 gongura prawns curry Here is the process for gongura prawns curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోంగూర : రెండు కప్పులు,,రొయ్యలు - ఒక కప్పు,,నెయ్యి - ఆరు టేబుల్ స్పూనులు,,టమోటో ముక్కలు - ఒక కప్పు,,అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను,,ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,,పచ్చిమిర్చి - నాలుగు,,ఎండుమిర్చి - 4,,ధనియాల పొడి - అరటీస్పూను,,పసుపు - చిటికెడు,,కారం - ఒక టేబుల్ స్పూను,,ఉప్పు - సరిపడా,,కరివేపాకు - రెండు రెమ్మలు,,కొత్తిమీర తరుగు - పావుకప్పు, Instructions: Step 1 గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించాలి. రొయ్యల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నేతిలో రొయ్యల్ని ఓ నిముషం పాటూ వేయించాలి. వాటిని ఓ బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఆ కళాయిలోనే ధనియాల పొడి, ఎండుమిర్చి, ఉల్లిపాయముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. Step 4 అవి వేగాక ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూర వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.    Step 5 కాసేపయ్యాక వేయించిన రొయ్యల్ని వేసి కలపాలి. బాగా ఉడికేవరకు కళాయిని స్టవ్ మీదే ఉంచాలి.    Step 6 చివరలో కొత్తి మీర తరుగు చల్లి స్టవ్ కట్టేయాలి. యమ్మీ యమ్మీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day