banana leaf fish fry By , 2018-01-09 banana leaf fish fry Here is the process for banana leaf fish fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చేపలు - రెండు ముక్కలు,,అరిటాకు - ఒకటి,,కొబ్బరి తురుము - రెండు టీస్పూనులు,,తరిగిన పచ్చిమిర్చి - రెండు టీస్పూనులు,,కొత్తిమీర తరుగు - రెండు టీస్పూనులు,,జీలకర్ర - టీస్పూను, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, Instructions: Step 1 చేపలను వేపుడుకు పనికొచ్చేలా రెండు పెద్ద ముక్క్లు తీసుకోవాలి. వాటిని బాగా కడిగి నిమ్మరసం రాసి, ఉప్పు చల్లి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. Step 2 ఈలోపు పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి తురుము కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు చేపముక్కల్ని తీసుకుని ఈ పేస్టును రెండు వైపులా దట్టంగా పూయాలి. అరిటాకు రెండు భాగాలుగా చేసుకోవాలి. Step 4 ఒక్కో అరిటాకులో చేపముక్కని పెట్టి చక్కగా మడతబెట్టి దారంతో కట్టాలి. అరిటాకు ఒకు పొరలా కాకుండా, రెండు మూడు పొరలతో చుట్టాలి.   Step 5 ఆ అరిటాకులను ఓవెన్ లో పెట్టుకోవాలి. ఓవెన్ లేని వాళ్లు స్టవ్ మీద కళాయిపెట్టి కాస్త నూనె వేసి ఈ అరిటాకులను అందులో పెట్టుకుని మూత పెట్టేయాలి.    Step 6 మంట తక్కువగా పెట్టి ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో అరిటాకులను తిరగేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో రెండు వైపులా చేప ఉడుకుతుంది.    Step 7 అరిటాకులు పైన మాడిపోయిన భయపడకండి. చేప మాడకుండా చూసుకుంటే చాలు.    Step 8 ఇలా 20 నిమిషాల పాటూ చిన్న మంట మీద ఉడికస్తే అరిటకులో చేప సిద్ధమైపోతుంది. తరువాత అరిటాకును విప్పితే ఘుమఘుమలాడే అరిటాకు ఫిష్ మసాలా రెడీ.          
Yummy Food Recipes
Add