Vankaya Pulusu Pachadi By , 2018-01-04 Vankaya Pulusu Pachadi Here is the process for Vankaya Pulusu Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు: రెండు (పెద్దవి),,నూనె: సరిపడా,,ఎండుమిర్చి: నాలుగు,,జీలకర్ర: టీస్పూను,,ఆవాలు: టీస్పూను, ఇంగువ: చిటికెడు,,ఉల్లిపాయలు: 2(ముక్కలుగా కోయాలి),,పచ్చిమిర్చి: నాలుగు,,కరివేపాకు: 2 రెబ్బలు,,మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు,,చింతపండుగుజ్జు: టేబుల్‌స్పూను,,బెల్లంతురుము: పావుకప్పు,,పంచదార: టీస్పూను,,పసుపు: అరటీస్పూను,,కారం: అరటీస్పూను,,ఉప్పు: రుచికి సరిపడా., Instructions: Step 1 వంకాయల్ని స్టవ్‌మీద నేరుగా పెట్టి కాల్చాలి. లేదంటే ఓవెన్‌లో కూడా బేక్‌ చేయవచ్చు.చల్లారిన తరవాత పైన తొక్క తీసేసి మెత్తని గుజ్జులా చేసి పక్కన ఉంచాలి. Step 2 బాణలిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి ముక్కలుగా చేసిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. Step 3 ఇప్పుడు వంకాయ గుజ్జు, చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పంచదార, పసుపు, కారం, ఉప్పు వేసి మంచినీళ్లు కూడా పోసి పది నిమిషాలు ఉడికించాలి. బాగా చిక్కబడ్డ తరవాత దించి వడ్డించాలి.        
Yummy Food Recipes
Add