Curry Leaves Chutney By , 2018-01-03 Curry Leaves Chutney Here is the process for Curry Leaves Chutney making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 25min Ingredients: కరివేపాకు - పదికట్టలు,,చింతపండు - నిమ్మకాయంత,,బెల్లం - వంద గ్రా,,మినప్పప్పు - మూడు చెంచాలు, ఆవాలు - రెండు చెంచాలు,,మెంతులు - అరచెంచా,,ఎండుమిర్చి - పదిహేను,,పచ్చిమిర్చి - ఆరు,,నూనె - ఆరుచెంచాలు, ఉప్పు - తగినంత,,సోంపు - అరచెంచా., Instructions: Step 1 బాణలిలో చెంచా అరచెంచా నూనె వేడిచేసుకుని కరివేపాకును వేయించుకుని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనెను వేడిచేసి మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, సోంపు వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసి రెండుమూడు నిమిషాలు వేయించి పొయ్యి కట్టేయాలి. Step 2 ఇప్పుడు వేడి చల్లారిన కరివేపాకును ముందుగా మిక్సీలో వేసి పొడి చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వేయించుకున్న పోపులో కొద్దిగా విడిగా తీసుకుని మిగిలిన దాంట్లో తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 తరవాత బెల్లం, ముందుగా పొడి చేసుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకుని మరోసారి మిక్సీ పడితే సరిపోతుంది. పచ్చడిని గిన్నెలోకి తీసుకున్నాక మిగిలిన పోపును కలిపితే నోరూరించే పచ్చడి అన్నంలోకి సిద్ధం.    
Yummy Food Recipes
Add