Chilli Paneer By , 2017-11-25 Chilli Paneer Here is the process for Chilli Paneer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పన్నీర్ -250 గ్రాములు,మైదా - రెండు చెంచాలు,కార్న్ ఫ్లోర్ - రెండు చెంచాలు,సెనగ పిండి - ఒక చెమ్చా,మిరియాల పొడి చిటికెడు,కారం - ఒక చెమ్చా,ఉప్పు - సరిపడినంత,పసుపు - చిటికెడు,చిల్లి సాస్ - అర చెమ్చ,సోయా సాస్ - అర చెమ్చా,టమాటో సాస్ - ఒక చెమ్చా,కాప్సికం - రెండు,ఉల్లిపాయ - ఒకటి,పచ్చి మిర్చి - రెండు,అజినమోటో - అర చెమ్చా,నీరు - సరిపడి నంత,నూనె - వేపుకు సరిపడ్డ, Instructions: Step 1 ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదా , కార్న్ ఫ్లోర్ , ఉప్పు , కారం, సెనగ పిండి, మిరియాల పొడి,పసుపు వేసి బాగా కలిపి ఆ తర్వాత కొంచం నీరు పోసి దోసల పిండి లా కలపాలి. మరి జారుగా ఉండకూడదు . Step 2  అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఓ పావుగంట తర్వాత పన్నీర్ ముక్కలని తీసి నూనెలో వేయించాలి. Step 3 ఎర్రగా వేగాక తీసి పేపర్ టవల్ మీద పెడితే నూనె పీలుస్తుంది .  Step 4 ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లి, క్యాప్సికం, పచ్చ్హి మిర్చి లని ఒక మూకుడులో రెండు చెంచాల నూనె లో వేయించాలి. అవి ఎర్రగా వేగాగానే, సాసులన్నిటి ని వేసి బాగా కలపాలి.   Step 5 ఆ తర్వాత వేయించిన పన్నీర్ కూడా వేసి , అజినమోటో కూడా చేర్చి బాగా కలిపి స్టవ్ ఆపాలి. .ఇష్టమయితే కొత్తిమీర వేసుకోవచ్చు .ఈ చిల్లి పన్నీర్ చాలా రుచిగా వుంటుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day