vankaya chutney recipe By , 2017-10-06 vankaya chutney recipe Here is the process for vankaya chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - అర కిలో,పచ్చి మిరపకాయలు - 50 గ్రాములు,చింతపండు - నిమ్మకాయంత,అల్లం - అంగుళం ముక్క,జీలకర్ర - టీ స్పూను,వెల్లుల్లి - 4 రెబ్బలు,ఉప్పు - సరిపడా,నూనె - 100 గ్రాములు,పోపు సామాను, కరివేపాకు, Instructions: Step 1 వంకాయ ముక్కలను కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. బాండీలో కొంచెం నూనె వేసి వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 మిగిలిన నూనెలో పచ్చిమిరపకాయల్ని కూడా వేయించుకోవచ్చు.  Step 3 పచ్చి మిరపకాయల్ని వేయించే ముందు కొద్దిగా గాటు పెట్టి వేయిస్తే ఎగిరి మొహాన పడవు.  Step 4 పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, అల్లం అన్నింటినీ రోట్లో వేసి నూరుకొని చివరలో వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి నూరుకోవాలి.    Step 5 పోపులో కరివేపాకు వేసి దీనిలో కలుపుకుంటే సరి. ఇష్టమైనవారు ఇందులో పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిపితే బావుంటుంది.              
Yummy Food Recipes
Add