bommidayalu mamidi kaya recipe By , 2017-09-25 bommidayalu mamidi kaya recipe Here is the process for bommidayalu mamidi kaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొమ్మిడాయిలు - కేజీ,మామిడికాయ ముక్కలు - 1 కప్పు,ఉల్లిపాయలు - 2,పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి),అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌,కారం- 2 టేబుల్‌ స్పూన్లు,పసుపు - చిటికెడు,ఉప్పు - సరిపడా,నూనె - తగినంత,కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,ధనియాలు, జీలకర్ర పొడి - 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 బొమ్మిడాయిల్ని శుభ్రం చేసి చిన్నవైతే అలాగే వేసుకోవచ్చు. కొంచెం పెద్దవైతే ముక్కలు చేసుకోవాలి.  Step 2 ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. పొయ్యి వెలిగించి చేపలగిన్నె (మందంగా, వెడల్పుగా ఉండే గిన్నె) పెట్టుకోవాలి. Step 3 దానిలో నూనె వేసి వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి.  Step 4 అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చేపముక్కలు వేసి బాగా కలపాలి.   Step 5 కొద్దిసేపయ్యాక మామిడికాయ ముక్కలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని సెగమీద ఉడకనివ్వాలి.    Step 6 అవసరమైతే మరికొన్ని నీళ్లు చల్లుకోవచ్చు. ఈ కూరని గరిటెతో కలిపితే ముక్కలు చితికిపోతాయి.    Step 7 గిన్నెనే పట్టుకుని మధ్య మధ్యలో కదపాలి. చివరిలో ధనియాలు, జీలకర్రపొడి చల్లుకోవాలి.    Step 8 ఆ తర్వాత కొత్తిమీర తురుము కూడా చల్లుకుని దించేయాలి.          
Yummy Food Recipes
Add