chicken chutney recipe By , 2017-09-20 chicken chutney recipe Here is the process for chicken chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - అరకిలో,వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి),కారం - అరకప్పు,ఉప్పు - గరిటెడు,లవంగాలు - 2,యాలకులు: - 1,దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క,(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి),నూనె - అరకిలో,నిమ్మకాయ - ఒకటి, Instructions: Step 1 చికెన్‌ ముక్కలు కడిగి ఒక బట్టమీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె పోసి చికెన్‌ ముక్కలు వేయించాలి.  Step 2 చికెన్‌ ముక్క నూనెలో ఉడికిందీ లేనిదీ చూసుకొని (మరీ గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో గిన్నెలోకి తీసుకోవాలి.  Step 3 స్టౌ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి. Step 4 ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేయాలి.    Step 5 గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి.    Step 6 ఇది బాటిల్‌లోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day