capsicum butter dosa recipe By , 2017-08-11 capsicum butter dosa recipe Here is the process for capsicum butter dosa making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: మినపప్పు - 100గ్రా.,,బియ్యం - 200గ్రా.,,శనగపప్పు - 50గ్రా.,,క్యాప్సికమ్ - 250 గ్రా.,,టొమాటో - 100గ్రా.,,జీరాపొడి- రెండు టీ స్పూన్‌లు,,ధనియాల పొడి - రెండు టీ స్పూన్‌లు,,మిర్చిపొడి - రెండు టీ స్పూన్లు,,ఉల్లిపాయలు - రెండు,,పచ్చిమిర్చి - నాలుగు,,కరివేపాకు - రెండు రెమ్మలు,,ఎండుమిర్చి - 6, వెన్న,,ఉప్పు - తగినంత,,నూనె - టేబుల్ స్పూన్, Instructions: Step 1 పై మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి. Step 2 ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది.  Step 3 ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.  Step 4 తరవాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి వేగాక క్యాప్సికమ్, టొమాటో ముక్కలను కూడా వేసి ఉడికించాలి.  Step 5 చివరగా జీరాపొడి, ధనియాలపొడి, మిర్చిపొడి వేసి బాగా కలిపి దించేయాలి.  Step 6 దోసెను వేసి, దాని చుట్టూ అంచులకు ఎరక్రారాన్ని (ఎండుమిర్చి, తగినంత ఉప్పు, నీరు పోసి గ్రైండ్ చేయాలి) రాసి, మధ్యలో క్యాప్సికమ్ కూరను వేసి, దానిపై వెన్నను పూయాలి. క్యాప్సికమ్ బటర్ దోసె.  
Yummy Food Recipes
Add