lemon poha By , 2014-07-23 lemon poha lemon poha - its very tasty and healthy recipe. easty to prepare this lemon poha.. Prep Time: 10min Cook time: 25min Ingredients: తగినంత ఉప్పు, 1 రెమ్మ కొత్తిమీర, 1 రెమ్మ కర్వేపాకు, చిటకెడు పసుపు, 1 కప్పు పల్లీలు, 1 బంగాళదుంప ఉడికించినది, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నిమ్మకాయలు, 3 కప్పులు పోహా (అటుకులు), Instructions: Step 1 ముందుగా అటుకులను కడిగి 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. Step 2 డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో ఇంగువ, ఆవాలు వేసి ఒక సెకను వేగించాలి. Step 3 ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేసి బాగా అన్నింటిని వేయించుకోవాలి. Step 4 . ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. వాటితో పాటు కరివేపాకు మరియు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి Step 5 5నిముషా తర్వాత అందులో వేరుశెనగలు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలి. వేరుశెనగ కొద్దిగా బ్రౌన్ కలర్ కు మారే వరకూ వేయించుకోవాలి. Step 6 మొత్తం మిశ్రమం అంతా వేగిన తర్వాత నానబెట్టుకొన్న అటుకులను ఫ్రైయింగ్ పాన్ లో వేసి, నిధానంగా మిక్స్ చేస్తూ అన్నింటిని వేయించుకోవాలి. పది నిముషాల తర్వాత ఉప్పు కూడా వేసి పూర్తిగా కలగలిపి మంటను తగ్గించేయాలి. Step 7 ఇప్పుడు పాన్ ను స్టౌ మీద నుండి క్రిందికి దింపుకొని నిమ్మరసాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలపాలి. చివరగా కొత్తిమీర తరుగుతో పోహాను గార్నిష్ చేయాలి. హెల్తీ లెమన్ పోహా రిసిపి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day