Tamarind Prawns curry recipe By , 2017-04-18 Tamarind Prawns curry recipe Here is the process for Tamarind Prawns curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చింత చిగురు- కప్పు,కాస్త పెద్ద రొయ్యలు- పావుకిలో,ధనియాల పొడి- చెంచా,జీలకర్రపొడి- అరచెంచా,ఉల్లిపాయ- ఒకటి,కొత్తిమీర- కట్ట,వెల్లుల్లి రేకలు- ఐదారు,నూనె- మూడు టేబుల్‌స్పూన్లు,గసగసాల పొడి - చెంచా,దాల్చిన చెక్కపొడి - అరచెంచా,అల్లంవెల్లులి పేస్టు- చెంచా,పసుపు- చిటికెడు,ఉప్పు- తగినంత,పచ్చిమిర్చి- ఐదు,కారం - చెంచా., Instructions: Step 1 ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చీ వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి.  Step 4 పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మరికాస్త సేపు మగ్గనివ్వాలి.    Step 5 ఇప్పుడు చింతచిగురుని అరచేతుల్లో వేసి బాగా నలిపితే పొడిలా తయారవుతుంది.    Step 6 దీన్ని రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి.    Step 7 తర్వాత ఉప్పూ, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి.    Step 8 అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కాసిని నీళ్లు పోసి మూతపెట్టేయాలి.    Step 9 ఇందులో ప్రత్యేకించి మసాలా వేయాల్సిన అవసరం లేదు. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి, కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day