Maharashtra Special Chicken recipe By , 2017-03-27 Maharashtra Special Chicken recipe Here is the process for Maharashtra Special Chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చికెన్ – 400 గ్రా,అల్లం, వెల్లుల్లి పేస్టు – 2 టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి పేస్టు – 1 టేబుల్ స్పూన్,ఎండుకొబ్బరి – 200 గ్రా,ధనియాలు – 1 టేబుల్ స్పూన్,ఎండుమిర్చి – 4,నువ్వులు – 1 టేబుల్ స్పూన్,నూనె – కావలిసినంత,ఉల్లిపాయాలు – 2,పసుపు – కొంచెం,కారం – 1 టేబుల్ స్పూన్,పెరుగు – 2 స్పూన్,గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్,యాలకులు – 4,దాల్చినచెక్క – చిన్నది,లవంగాలు – 6,బిరియాని ఆకు – 2,మసాలా పొడీ -1 టేబుల్ స్పూన్,కొత్తిమీర ఆకులు – 2 టేబుల్ స్పూన్,ఉప్పు – తగినంత,నీరు – ౩ కప్పులు, Instructions: Step 1 చికెన్ బాగా కడిగి కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను చికెన్ ముక్కల ఫై  బాగా రాసి గంట సేపు పక్కన పెట్టుకోవాలి.  Step 2 పాన్ తీసుకోని దానిలో నునె వేసి దానిలో గరం  మసాలా దినుసులు, ఉల్లిపాయల ముక్కలు, మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి Step 3 తరువాత ఉప్పు, కారం, పసుపు మరియు గరం మసాలాతో పాటుగా  ముక్కలను కూడా  వేయాలి.  Step 4 ఇప్పుడు ముక్కలకు మసాలా బాగా పట్టేలా చూసుకుని నీరు కలిపి ఉడికించాలి.  Step 5 ఆ తరువాత  10 నుంచి 12 నిమిషాలు తరువాత ఎండు మిర్చి, కొబ్బరి, నువ్వులు, ధనియాలను వేయించి మిక్సీ చేసుకుని పేస్టు లాగ కలపాలి.  Step 6 చిట్ట చివరకు దీనిని దించే ముందు పెరుగు కలిపి కొంచెం  కొత్తి మీర  మరియు కొంచెం గరం మసాలా చల్లితే తినటానికి చాలా రుచిగా ఉంటుంది
Yummy Food Recipes
Add