Nuvvula Karam Janthikalu Recipe By , 2017-02-02 Nuvvula Karam Janthikalu Recipe Here is the process for Nuvvula Karam Janthikalu Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: బియ్యం పిండి : రెండు కప్పులు,శనగపిండి : పావుకప్పు,నువ్వులు : మూడు స్పూన్లు,బట్టర్ : పావుకప్పు,సాల్ట్ : తగినంత,వాము : రెండు స్పూన్లు,కారం : రెండు స్పూన్లు,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి వేడి ఎక్కాక దించుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి , శనగపిండి , సాల్ట్ , వాము , కారం, నువ్వులు , బట్టర్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి , బట్టర్ అంత కలిసేలాగా కలుపుకుని అందులో వేడి నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి . Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కనివ్వాలి , ఒక చిన్న గిన్నె లో కొన్ని వాటర్ తీసుకుని అందులో చేతి ని తడుపుకుంటూ బియ్యం పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం ముద్దగా తీసుకుని జంతికలు వేసుకునే దాంట్లో పెట్టుకుని ప్లాస్టిక్ కవర్ మీద చుట్టూ రౌండ్ గా తిప్పుతూ వేసుకోవాలి , ఇలా అన్ని చేసుకుని ఒక్కొకటి చొప్పున వేడెక్కిన నూనె లో నెమ్మదిగా వేసుకుని రెండు వైపులా వేయించుకుని తీసుకోవాలి .
Yummy Food Recipes
Add
Recipe of the Day