aloo bonda recipe cooking tips special morning breakfast By , 2015-01-05 aloo bonda recipe cooking tips special morning breakfast aloo bonda recipe cooking tips special morning breakfast : the cooking tips to make aloo bonda recipe. Prep Time: 25min Cook time: 30min Ingredients: 1/2 కేజీ బంగాళదుంపలు, తగినంత నూనె, తగినన్ని నీళ్లు, 1/2 కేజీ శెనగపిండి, 1 కప్ బియ్యంపిండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగు, 2 టీ స్పూన్స్ అల్లంగుజ్జు, 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి, 2 టీ స్పూన్స్ నిమ్మరసం, 1 టీ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్స్ జీలకర్ర, 1/2 టీ స్పూన్స్ పసుపు, తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్స్ కేసరి కలర్, 1/4 టీ స్పూన్స్ వంటసోడా, Instructions: Step 1 ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బంగాళదుంపలను వేసి ఉడికించుకొని, చల్లార్చుకోవాలి. తర్వాత దుంపలపై వున్న తొక్కను పూర్తిగా తీసేసి, బాగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేయించాలి. నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేయించాలి. అనంతరం పసుపు, అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి.. సువాసన వచ్చేవరకు వేగనివ్వాలి. Step 3 ఇప్పుడు వేగుతున్న ఈ మిశ్రమంలో ఇదివరకు చిదిమి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి.. తగినంత ఉప్పు కలుపుకుని పొడిపొడిగా వేయించాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు వేయించాలి. అనంతరం క్రిందకు దించేసి నిమ్మరసం పోసి కలపాలి. Step 4 ఇదిలావుండగా.. మరొక పాత్రను తీసుకుని అందులో శెనగపిండి, బియ్యప్పిండి, కేసరి కలర్, వంటసోడా, తగినంత నీళ్లు, ఉప్పు వేసి.. గట్టిగా వుండే పెరుగులా పిండిని కలిపి వుంచుకోవాలి. Step 5 ఇప్పుడు ఇదివరకు తయారుచేసిన దుంపల కూరను లడ్డూలంత సైజులో ముద్దులుగా చుట్టి వాటిని పిండిలో ముంచి.. కడాయి మీద వేయించిన నూనెలో వేస్తూ దోరగా వేయించి తీసేయాలి. అంతే!
Yummy Food Recipes
Add