prawns gongura recipe cooking tips healthy food recipe By , 2014-12-23 prawns gongura recipe cooking tips healthy food recipe prawns gongura recipe cooking tips healthy food recipe : the cooking tips to make prawns gongura recipe which contains the highly healthy ingradients which improves the health of human bodies. Prep Time: 40min Cook time: 30min Ingredients: 1/4 కప్ రొయ్యలు, 1 కప్ గోంగూర, 2-3 ఉల్లిపాయలు, 2-5 టమోటాలు, 4-6 పచ్చిమిర్చి, ఎండు మిర్చి, 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, సరిపడేంత తాళింపు దినుసులు, సరిపడా ధనియాల పొడి, సరిపడా అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 5 స్పూన్లు నూనె/నెయ్యి, సరిపడేంత కరివేపాకు, కొత్తిమీర (గార్నిషింగ్), Instructions: Step 1 మొదట మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గోంగూరను నీటిలో వేసి కడగాలి. అనంతరం ఈ గోంగూరను ఒక నీటి పాత్రలో వేసి కొద్దిసేపటివరకు ఉడికించి.. పక్కన పెట్టుకోవాలి. అలాగే రొయ్యలను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. Step 2 అనంతరం స్టౌవ్ మీద ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో శుభ్రం చేసిన రొయ్యలను వేసి కొద్దిసేపటివరకు బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యలను నెయ్యి లేకుండా విడిగా తీసి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఆ పాన్’లోనే మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాళింపుదినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగిన అనంతరం అందులో అల్లంవెల్లుల్లి మిశ్రమం.. ఆ తర్వాత టమోటా ముక్కల్ని చేర్చాలి. Step 4 ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించిన అనంతరం అందులో ఇదివరకు ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి.. ఆ పాత్రకు మూత పెట్టేయాలి. Step 5 కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో ఇదివరకు వేయించిన రొయ్యల్ని, ధనియాలపొడిని చేర్చి.. మరో 5 నిముషాలపాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర లేదా కరివేపాకు తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే! ఘుమఘుమలాడే గోంగూర రొయ్యల కర్రీ రెడీ!
Yummy Food Recipes
Add