Rajasthani Mutton Curry By , 2018-05-12 Rajasthani Mutton Curry Here is the process for Rajasthani Mutton Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour Ingredients: మటన్‌ - ఒక కిలో (ఎముకలతో. చిన్న ముక్కలుగా కోయాలి),పెరుగు - ఒకటిన్నర కప్పు,ఆవనూనె - ఐదు టేబుల్‌ స్పూన్లు,లవంగాలు - ఆరుబిర్యానీ ఆకులు,,నల్ల యాలక్కాయలు - ఒక్కోటి రెండు చొప్పున,ఎర్ర ఉల్లిపాయలు (మీడియం సైజ్‌. సన్నటి ముక్కలుగా తరిగి) - మూడు,కారం - ఒకటిన్నర టీస్పూన్‌ (రుచికి తగినంత వేసుకోవచ్చు)కాశ్మీరి కారం,,పసుపు - ఒక్కో టీస్పూన్‌ చొప్పున,ఉప్పు - రుచికి సరిపడా,తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌,వెల్లుల్లి రెబ్బలు - నాలుగు (సన్నగా తరిగి),నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు,నీళ్లు - ఒకటిన్నర కప్పు,కొత్తిమీర తరుగు - కొద్దిగా, Instructions: Step 1 ఆవనూనెని అడుగు మందంగా ఉన్న పాన్‌లో వేసి మంట పెంచి పొగ వచ్చే వరకు వేడిచేయాలి. Step 2 తరువాత స్టవ్‌ మీద నుంచి పాన్‌ని దింపి నూనె చల్లారనివ్వాలి. Step 3 తరువాత మళ్లీ ఒకసారి ఆవనూనెను ఓ మాదిరి మంట మీద వేడిచేసి లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు వేసి అవి చిటపటమనే వరకు వేయించాలి. Step 4 ఉల్లి తరుగు వేసి ఓ మాదిరి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి మరో నిమిషం వేయించాలి.    Step 5 ఆ తరువాత మటన్‌ వేసి పావుగంట ఉడికించాలి.మంట తగ్గించి పెరుగు, కారం, కాశ్మీరి కారం, పసుపు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉంచాలి.   Step 6 వెల్లుల్లి తరుగు, నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి మూతపెట్టి 50 నిమిషాలు ఉడికించాలి. సన్నటి మంట మీదే ఉడికించాలి.    Step 7 ఒకవేళ రసం ఎక్కువ కావాలనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు.కొత్తిమీర తో అలంకరించి చపాతీలతో తింటే భలే బాగుంటుంది ఈ రాజస్తానీ మటన్‌ కర్రీ.              
Yummy Food Recipes
Add