FISH FINGERS By , 2018-02-23 FISH FINGERS Here is the process for FISH FINGERS making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: స్నేపర్‌ ఫిల్లెట్స్‌- 750 గ్రాములు (వైట్‌ ఫిష్‌వి),,ఉడకబెట్టి మెత్తగా చేసిన బంగాళాదుంపలు-రెండు,,పచ్చిమిరపకాయలు-రెండు,,అల్లం-ఒక టీస్పూను,మిరియాలు- రుచికి సరిపడా,,ఉప్పు-తగినంత,,గుడ్లు-రెండు,,బ్రెడ్‌ ముక్కలపొడి- అర కప్పు,,నూనె- ఒక కప్పు., Instructions: Step 1 ముందుగా పాన్‌ తీసుకుని అందులో చేప ముక్కల్ని వేసి నీళ్లు పోయాలి.తరువాత ఉప్పు వేసి బాగా ఉడకపెట్టాలి. Step 2 అవి చల్లారాక చేప ముక్కల్లో ముల్లు లేకుండా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టాలి.  Step 3 తర్వాత అల్లం, పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. పాన్‌లో నూనె పోసి సన్నని మంటపై నూనెను వేడి చేయాలి.  Step 4 ఒక గిన్నె తీసుకుని అందులో చేప ముక్కల్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేయాలి.  Step 5 అందులోనే అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు, కొత్తిమీర ఆకులు, కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా కలపాలి. Step 6 తరువాత ఉప్పు సరిపోనట్టు అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని వాటిని ఫింగర్‌ షేపులో చేసి గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్‌ ముక్కల పొడిలో దొర్లించాలి. Step 7 అలా చేసిన ముక్కల్ని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకూ వేగించాలి.  Step 8 ఫిష్‌ ఫింగర్స్‌ ఎక్కువ నూనెను పీల్చినట్టు అనిపిస్తే పేపర్‌ టవల్స్‌లో వేసి వాటికి పట్టిన అదనపు నూనెను డ్రై చేయొచ్చు. ఈ ఫిష్‌ ఫింగర్స్‌ను టొమాటో సస్స్ తింటే చాలా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add