Corn Biryani Recipe By , 2017-11-14 Corn Biryani Recipe Here is the process for Corn Biryani Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కార్న్(మొక్కజొన్న): 1½ cup,ఉల్లిపాయ: 1,టమోటో: 2,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్,పచ్చిమిర్చి: 5,నూనె: 3 స్పూన్స్,నెయ్యి: 3 స్పూన్స్,కొబ్బరి పాలు 1cup,నీళ్ళు: 3 cups,ఉప్పు: రుచికి సరిపడా,కారం: 2 స్పూన్స్,పసుపు: ½ స్పూన్స్,కొత్తిమీర : 2(chopped),పుదీనా : తగినంత,గరం మసాలా: 2tsp,బిర్యానీ ఆకు: 1,చెక్క: 2,లవంగాలు :5,యాలకులు :3,బాస్మతి రైస్: 2 cups, Instructions: Step 1 ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు మందపాటి డీప్ బాటమ్ పాత్రను స్టౌ మీద పెట్టి ఆయిల్ , నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో బిర్యాని ఆకు, చెక్క, లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి. Step 3 అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి. Step 4 ఉల్లిపాయ ముక్కలు రంగు మారే సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు టమోటో వేసి, టమోటో మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.   Step 5 తర్వాత మొక్కజొన్న గింజలు, పసుపు, కారం, కొబ్బరి పాలు మరియు ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి. ఈ మిశ్రమం అంతా చిక్కబడేంత వరకూ వేయించుకోవాలి.   Step 6 ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసి ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. తర్వాత ఇందులో బాస్మతి బియ్యాన్ని, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి బాగా ఉడికించాలి. అంతే కార్న్ బిర్యానీ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add