Capsicum paneer Curry Recipe By , 2017-11-07 Capsicum paneer Curry Recipe Here is the process for Capsicum paneer Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాప్సికం - 400 గ్రా.,పన్నీర్ - 50 గ్రా.,యాలకులు - 3,దాల్చిన చెక్క - చిన్న ముక్క,సోంపు - అరటీస్పూన్,జీలకర్ర - టీస్పూన్,కారం - 2 టేబుల్ స్పూన్లు,ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు,ఉల్లిపాయలు - 5,అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీస్పూన్లు,పసుపు - 3 చిటికెలు,చింతపండు - కొద్దిగా,లవంగాలు - 4,నూనె - సరిపడగా,ఉప్పు - తగినంత,వేరుసెనగ పప్పు - ఒక కప్పు,కొత్తిమీర - కొంచం,పుదీనా - కొంచం,కరివేపాకు - కొద్దిగా,తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు, Instructions: Step 1 ముందుగా  ఉల్లిపాయలు,క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి. Step 2 తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి  వేరుసెనగ పప్పులు,నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్ ను విడివిడిగా వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుసెనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసిదాల్చిన చెక్క, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.   Step 5 తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్  కొద్దిగా నీళ్ళు వేసి ఉడకనివ్వాలి .   Step 6 ఇప్పుడు  ధనియాల పొడి,కారం వేసి  పది నిముషాలు ఉడికించాలి.   Step 7 చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిముషాలు ఉకించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.          
Yummy Food Recipes
Add