Semiya Daddojanam By , 2017-10-30 Semiya Daddojanam Here is the process for Semiya Daddojanam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సేమ్యా 1 కప్పు ( కొద్దిగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి),చిక్కటి పెరుగు 2 కప్పుస్,ఉప్పు తగినంత,పోపు సామాగ్రి- 2 స్పూనులు,పచ్చిమిరపకాయలు- 2-3 సన్నగా తరిగినవి,కొత్తిమీరా, కరివేపాకు- తగినంత,జీడిపప్పులు, కిస్ మిస్ లు- నేతిలో వేయించి పెట్టుకున్నవి,దానిమ్మ గింజలు- పైన అలంకరణకి,సన్నగా తరిగిన అల్లం ( ఇష్టమైతే వేసుకోవచ్చు), Instructions: Step 1 ముందుగా సేమ్యాని కొద్దిగా నెయ్యిలో వేయించుకుని ఆ తర్వాత నెళ్ళల్లో మెత్తగా ఉడికించుకోవాలి. Step 2 ఉడికిన తర్వాత నీరు పూర్తిగా వంపేసి, ఒకసారి చల్లనీళ్ళతో కడిగాలి. Step 3 ఇప్పుడు కొద్దిగా గిలక్కొట్టిన చిక్కటి పెరుగులో ఉడికించిన సేమ్యా, ఉప్పూ వేసి కలిపాలి. పెరుగు పుల్లగా ఉన్నా, పులవకూడదనుకున్నా సగం పాలు కలుపుకోవచ్చు. Step 4 మూకుడులో నూనె వేడి చేసి, దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగాకా, ఇంగువ, సనంగా తరిగిన అల్లం, పచ్చిమిర్చీ, కరివేపాకు వేసుకొని అవి కొంచం వేగగానే దింపి చల్లారనివ్వాలి.   Step 5 ఇప్పుడు చల్లారిన పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న సేమ్యా, పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.   Step 6 పైన అలంకరణకి దానిమ్మ గింజలు, తురిమిన కేరట్ వేసుకోవాలి. ఇది వేడిగా తిన్నా, లేక ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add